హైదరాబాద్ లో ఆర్.ఎస్.ఎస్ జాతీయ సమన్వయ సమావేశాలు జరుగనున్నాయి. వచ్చే నెల 5 నుండి 7 వ తేదీ వరకు 3 రోజుల పాటు అఖిల భారత సమన్వయ సమావేశాలు జరుగనున్నాయి. ఆర్ ఎస్ ఎస్ స్పూర్తి ప్రేరణతో పని చేస్తున్న వివిధ క్షేత్రాల ముఖ్యులు ఈ సమావేశాలకు పాల్గొననున్నారు. బీజేపీ తో సహా 36 సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్, ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసభలే..ఆర్.ఎస్.ఎస్ సహా ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశాలకు రానున్నారు.
బీజేపీ నుండి జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. Bms, ఏబీవీపీ, vhp, కిసాన్ సంఘ్, విద్యా భారతి, సేవిక సమితి లాంటి సంఘ పరివార క్షేత్రాల జాతీయ నేతలు హాజరు అవుతారు. ఆయా క్షేత్రాలలో జరుగుతున్న కార్యక్రమాలు… ఎదురవుతున్న సవాళ్లు, అనుభవాల పై చర్చ జరుగనుంది. ఈ సమావేశాల్లో పర్యావరణం, కుటుంబ ప్రభోదన్, సామాజిక సమరసత వంటి కార్యక్రమాలు సమన్వయం తో చేయడం పై చర్చ జరుగనుంది.