BREAKING : భారత్​లోని కీలక నేతపై ఉగ్రదాడికి కుట్ర

-

భారత్‌లో ఐసిస్ భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నింది. ఈ విషయాన్ని పసిగట్టిన రష్యా భద్రతా సిబ్బంది సూసైడ్ బాంబర్ ను అదుపులోకి తీసుకుంది. ఆ దేశ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించిన సమాచారం మేరకు.. ఐసిస్ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి బాంబర్‌ను రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ బాంబర్‌ భారత్‌లోని ఓ ప్రముఖ నాయకుడిపై ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు కుట్రపన్నాడని ఎఫ్‌స్‌బీ అధికారులు వెల్లడించినట్లు తెలిపింది.

‘రష్యాలో నిషేధానికి గురైన ఇస్లామిక్ స్టేట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌కు చెందిన సభ్యుడిని ఎఫ్‌ఎస్‌బీ గుర్తించి, అదుపులోకి తీసుకుంది. అతడు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవాడు. భారత్‌లోని పాలక వర్గాలకు చెందిన ఓ వ్యక్తిని హత్యచేసేందుకు ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నాడు’ అని సంబంధిత అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రం ఐసిస్‌ను ఉగ్రసంస్థగా నోటిఫై చేసింది. ఈ సంస్థ తన సిద్దాంతాలను వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తోందని, దీనిపై దర్యాప్తు సంస్థలు దృష్టిసారించాయని కేంద్రమంత్రి వర్గాలు వెల్లడించాయి. చట్ట ప్రకారం తగిన చర్యలుంటాయని పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version