ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం.. అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్

-

అమెరికాకు రష్యా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం వస్తే క్షణాల్లో క్షిపణులతో దాడి చేసి.. స్పందించేందుకైనా తమ దేశానికి సమయం ఇవ్వబోమన్న అపోహల్లో అమెరికా రాజకీయనాయకులు ఉన్నారని.. వాటిని వీడాలని రష్యా పేర్కొంది. తమ దేశ ఉనికికే ప్రమాదం వస్తే.. అమెరికా సహా ఎలాంటి శక్తినైనా ధ్వంసం చేసే అత్యాధునిక ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేసింది.

‘రష్యా ఓపిగ్గా ఉంది. సైనికశక్తితో ఇతరులను కవ్వించాలని అనుకోవడం లేదు. అయితే ఉనికికే ముప్పు ఎదురైతే అమెరికా సహా ఎలాంటి వ్యతిరేక శక్తులనైనా ధ్వంసం చేయగల సత్తా మాకు ఉంది’’’ అని ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి నికొలోయ్‌ పత్రుషేవ్‌ హెచ్చరించారు.

మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని సోమవారం రోజున అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) అధిపతి రఫెల్‌ గ్రాసీ కలిశారు. ప్లాంటులో పరిస్థితి మెరుగుపడటం లేదని, ఆ ప్రాంతమంతా సైన్యం ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధ్యక్షుడికి గ్రాసీ వివరించారు. ఇటీవల విద్యుత్కేంద్రానికి పలుమార్లు కలిగిన విద్యుత్తు అంతరాయాలను, డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడాల్సి రావడాన్ని ప్రస్తావించారు. ఈ వారంలో ప్లాంటును రఫెల్‌ గ్రాసీ దర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version