ఉక్రెయిన్ crisis : ఇండియాకు అమెరికా వార్నింగ్

-

రష్యా తో పొత్తు పెట్టుకోవద్దని భారత్ ను మరోసారి హెచ్చరించాడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశం తటస్థ వైఖరిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీరును వ్యతిరేకిస్తూ పలు ఆంక్షలు విధించిన అమెరికా మరోసారి భారతదేశం తీరును తప్పు పట్టింది. ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత భారత్ ఇచ్చిన కొన్ని ప్రతిస్పందనల పై అమెరికా అధికారులు తీవ్ర నిరాశకు గురయ్యారని అమెరికా అత్యున్నత ఆర్థిక సలహాదారు బ్రియన్ డీస్ తెలిపారు. ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి చైనా, భారత్ రెండు తీసుకున్న నిర్ణయాల వల్ల మేము నిరాశకు గురి అయ్యామని అన్నారు.

బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం, బ్రియన్ డీజ్ మీడియాతో మాట్లాడుతూ రష్యాతో వ్యూహాత్మక కూటమిగా దీర్ఘకాలికంగా భారత్ ఉంటుందని అమెరికా తెలిపింది. వాస్తవానికి ఉక్రెయిన్ పై యుద్ధం చేసిన తర్వాత అమెరికా , యూరప్ , ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు రష్యా పై ఆర్థిక ఆంక్షల వర్షం కురిపించాయి. అదే సమయంలో భారతదేశం అలా చేయలేదు. బదులుగా రష్యా నుండి నిరంతరం చమురును దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం పట్ల భారత్ అవలంబిస్తున్న వైఖరి అమెరికాతో సంబంధాలను దెబ్బతీస్తుంది. ఆసియాలో చైనా అధిపత్యాన్ని సవాలు చేయడానికి ఎదుర్కోవడానికి అమెరికాకు భారతదేశం ప్రధాన భాగస్వామిగా పరిష్కరించడమే దీని వెనుక కారణం.

Read more RELATED
Recommended to you

Exit mobile version