ఉక్రెయిన్- రష్యా వార్ ఎఫెక్ట్ ప్రపంచంపై కనిపిస్తోంది. మరోవైపు రష్యాపై యూరోపియన్ దేశాలు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనికి తోడు యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దీని కారణంగానే ఇండియాలో వంటనూనెల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి.
అయితే తాజాగా ఆయిల్ పరిశ్రమ పరిశ్రమ ప్రతినిధులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే రెండు రోజుల్లో ఆయిల్ రేట్లు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. యుద్ధం ప్రారంభానికి ముందే 1.5 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ నూనెతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన నౌక త్వరలోనే మన దేశానికి రానున్నట్లు వెల్లడించారు. ఇటీవల బాగా పెరిగిన వంటనూనెల ధరలు తగ్గుతాయని తెలిపారు. మనకు వచ్చే సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా దేశాల నుంచే వస్తోంది. ఇందులో 80 శాతానికి పైగా ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి అవుతోంది. మరోవైపు పామాయిల్ ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఇండియాకు దిగుమతి అవుతుండటంతో… ఎడిబుల్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి.