ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్ న్యూస్… ఇంటర్న్ షిప్ కు అనుమతి

-

ఉక్రెయిన్- రష్యా వార్ చాలా మంది భారతీయ విద్యార్థులను అగమ్యగోచర పరిస్థితుల్లో పడేసింది. ఎంబీబీఎస్ చేసేందుకు ఉక్రెయిన్ కు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వెలుతుంటారు. ఇలాంటి వారికి ప్రస్తుతం యుద్ధ పరిణామాలు ఇబ్బందులు కలుగచేస్తున్నాయి. చాలా మంది విద్యార్థులకు మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పట్టా వస్తుందనుకునే సమయంలో యుద్ధం మొదలైంది. మరికొందరు… ఎంబీబీఎస్ కోర్స్ మధ్యలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ప్రాణాలతో బతికుంటే చాలు అనుకుని స్వదేశం బాటపట్టారు. అయితే మధ్యలో వదిలేసిన చదువుపై అందరు విద్యార్థుల్లో ఆయోమయం నెలకొంది. 

అయితే ఇలాంటి విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వారికి మనదేశంలో ఇంటర్న్ షిప్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో పాటు ఎవరైతే ఎంబీబీఎస్ మధ్యలో ఉన్నారో వారికి ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. కరోనా, యుద్ధ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంబీబీఎస్ విద్యార్థుల శ్రేయస్సు కోసం నేషనల్ మెడికల్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదువుతున్న వేళమంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version