టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సెలెక్టివ్ పాత్రలు ఎంచుకున్నప్పటికీ ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది. ఈ గ్లామర్ ప్రపంచంలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో నటిస్తూ విపరీతంగా ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈమె ఒక నటి మాత్రమే కాదు రియల్ లైఫ్ లో డాక్టర్ కూడా.. నిజానికి సాయి పల్లవి నటించిన ఏ సినిమా అయినా సరే ఒకవేళ డిజాస్టర్ అయితే ఈమె నటనకు మాత్రం మంచి గుర్తింపు లభిస్తుంది. టాలీవుడ్ లో ఆ రకమైన క్రేజ్ దక్కించుకున్న ఏకైక బ్యూటీ సాయి పల్లవి అని చెప్పవచ్చు.
తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ తో పాటు డాన్సింగ్ టాలెంటు అడిషనల్ క్వాలిఫికేషన్ గా కనిపిస్తుంది. శరీరాన్ని విల్లులా వంచి.. కష్టపడే తత్వం సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. తాజాగా ఈమె పురుషుల అందం గురించి ఒక హీరోని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. సినిమాలు చేసే క్రమంలో మీ పక్కన నటించే హీరో గురించి అడుగుతారా? అని ప్రశ్నించడం.. ఫలానా హీరోతో కలిసి నటించాలన్న ఆలోచనలు లేవు.. కథ బాగుంటే చేస్తా.. స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా చేస్తారా ? ఇలాంటి మాటలు కూడా నచ్చవు. నేను ఏ సినిమా ఒప్పుకున్నా సరే అందులో హీరో గురించి అడగను .. వాళ్ళు స్టేటస్ గురించి పట్టించుకోను.. నేనొక నటిని.. కథ అందులోని పాత్ర నచ్చితే ఎటువంటి సినిమా అయినా సరే చేస్తాను. నటి గా కూడా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దానికి లోబడే నేను పని చేస్తాను. ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలపై గౌరవం ఉంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ తో ఒక సినిమా కూడా చేయలేదు. కానీ ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం అంటే చెప్పుకొచ్చింది..
మహేష్ బాబు గురించి మాట్లాడుతూ .. మహేష్ స్క్రీన్ ప్రజెంట్ అంటే చాలా ఇష్టం. మగాళ్ళు ఇంత అందంగా ఉంటారా? అని మొదటిసారి ఆశ్చర్యపోయిన సందర్భం అది.. అలాగే బాలీవుడ్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ అంటే ఇష్టం. వీళ్లిద్దరూ ఇష్టమైన నటులు అంటూ చెప్పుకొచ్చింది.