పుట్టపర్తి సత్య సాయి ఆశ్రమం లో సాయి పల్లవి.. ఫోటోలు వైరల్

-

మా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి నుంచి సినిమా వస్తుందంటే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ఆయన అభిమానులు వేచి చూస్తూ ఉంటారు కానీ సాయి పల్లవికి కొన్ని సినిమాలతోనే ఇంత ఇమేజ్ వచ్చింది. చాలా సింపుల్ గా కనిపిస్తూనే… అందరి మనసులు దోచేసింది సాయి పల్లవి.

చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త తీసుకుంటుంది. అందుకే ఓకే వాట్ ఇ.హెచ్.యఫ్ దెయ్యాల తో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే పెరుగుతూ పోతోంది. ఇది ఇలా ఉండగా… తాజాగా పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమంలో ఒక్కసారిగా ప్రత్యక్షమైంది సాయి పల్లవి. నార్మల్ సారీ కట్టుకుని పుట్టపర్తి లో పర్యటించింది సాయి పల్లవి.

తన సిబ్బందితో కలిసి పుట్టపర్తి వెళ్లిన సాయి పల్లవి… ఆ ఆశ్రమం విశేషాలను తెలుసుకుంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల విడుదలైన లవ్ స్టోరీ సినిమా లో హీరోయిన్ గా సాయిపల్లవి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version