తెలంగాణ నేతల మధ్య ‘ఎకరాల’ వార్ నడుస్తోంది. తాజాగా ఈ వివాదంపై AP ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ‘హైదరాబాద్లో ఎకరం అమ్మితే ఏపీలో వందెకరాలు కొనొచ్చంటున్నారు. ముంబైలో ఎకరం అమ్మితే ఇంకా ఎక్కువ కొనొచ్చు. అమెరికాలో అమ్మితే 10 వేల ఎకరాలు కొనొచ్చు. ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణ పల్లెలకు వెళ్తే కరెంట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది’ అని సజ్జల విమర్శించారు.
ముద్రగడ పార్టీలకు అతీతంగా పని చేస్తారని.. ముద్రగడ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడుతూ.. అక్కడికి వెళితే పవర్ కట్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో వంద ఎకరాలు వస్తాయంటే, మరి బొంబాయిలో భూమి అమ్మినా తెలంగాణలో కూడా వంద ఎకరాలు వస్తాయని సజ్జల సెటైర్లు వేశారు. చంద్రబాబును సీఎం చెయ్యాలనేది పవన్ కల్యాణ్ స్లోగన్ అన్నారు. ఆ స్టేట్మెంట్ పవన్ ముందే చెప్పాడని, అసలు విషయం అక్కడే అర్థం అవుతోందని అన్నారు. ఒక స్కీం ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే ప్రచారం చేస్తున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రతి చోట ఒక పోలీస్ ను పెట్టలేం కదా అని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో శిక్షలు త్వరగా పడుతున్నాయని అన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు క్రైం తక్కువగా ఉందని అన్నారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడానికి ఎలాంటి సమస్యలు లేవని, ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారని అన్నారు.