ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం తగ్గుతాయంటు వస్తున్న వార్తల ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు తగ్గించింది అంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపణలు చేయడం సరికాదని సీఎం సమీర్ శర్మ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించాలని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా లేదని తెల్చి చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులకు మరో పది రోజుల్లో కొత్త జీతం జమ అవుతుందని ప్రకటించారు. అప్పుడు పాత నెల జీతం యొక్క పే స్లిప్ తో పాటు కొత్త నెల జీతం పే స్లిప్ పోల్చి చూడాలని తెలిపారు. అప్పుడు ప్రభుత్వం జీతం తగ్గించిందో లేదో.. ఉద్యోగులకే తెలుస్తుందని తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ లో కూడా కొత్తగా చాలా ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. దీంతో అందరినీ సమ న్యాయం చేస్తున్నామని తెలిపారు.