సల్మాన్ ఖాన్ – ఐశ్వర్య రాయ్ విడిపోవడానికి కారణం ఎవరంటే అనబడిన..?

-

సినీ ప్రపంచం లో ప్రేమ అంటేనే ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోతారు. ఇలా కొంతమంది హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రేమలో పడతారు. కానీ కొందరి విషయంలో ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి పోతుంది. ఇలాంటి ఉదాహరణలు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయి . ఇందులో ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ ప్రేమ కథ ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. అప్పట్లో అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ను వివాహం చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా గడుపుతూ ఉండేవారు. అయితే వీరి ప్రేమ విఫలం కావడానికి సల్మాన్ ఖాన్ కారణమని ఇప్పటికీ అతని సన్నిహితులు చెబుతుంటారు.అసలేం జరిగింది అంటే ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీ కి వచ్చేసరికి సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్.. కానీ అప్పటికే సల్మాన్ సోవీ అలీ తో ప్రేమలో ఉన్నాడు. అప్పటికే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్న సమయంలోనే సల్మాన్ ఖాన్ హమ్ దిల్ దే చుకే సనం సినిమా చేయబోతున్నాడు . సినిమాకు మంచి హీరోయిన్ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ కోసం హీరోయిన్ ను వెతుకుతున్నాడు. అప్పుడు అప్పటికే తనకు పరిచయం ఉన్న ఐశ్వర్య రాయ్ ను సల్మాన్ ఖాన్ కు చూపిస్తాడు డైరక్టర్. ఇక సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ను చూడగానే ఒప్పుకొని సినిమా పూర్తి చేస్తారు. ఇక ఈ సినిమా పూర్తి చేసేసరికి ఐశ్వర్య రాయ్ – సల్మాన్ ఖాన్ ప్రేమలో పడతాడు. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. వీరిద్దరి ప్రేమ విషయం తెలుసుకున్న సోవీ అలీ వీరి మీద కోపంతో అమెరికాకు వెళ్లి పోతుంది.ఇదే సమయంలో సల్మాన్ కుటుంబానికి ఐశ్వర్య బాగా దగ్గర అవుతుంది. కానీ ఐశ్వర్య చేసిన పనికి ఆమె తల్లిదండ్రులు ఏ మాత్రం ఒప్పుకోరు. దీంతో ఐశ్వర్య వేరొక అపార్ట్మెంట్ తీసుకొని అక్కడ అద్దెకు ఉండడం మొదలు పెడుతుంది. ఇక సల్మాన్ ఖాన్ ఐశ్వర్య ను వివాహం చేసుకోవాలని అడగడం.. ఇక అప్పుడే నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతున్న ఐశ్వర్య పెళ్ళికి తొందరెందుకు అని చెప్పడం.. ఇక సల్మాన్ ఖాన్ వినకుండా ప్రతిరోజు ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఐశ్వర్య తల్లిదండ్రులు సల్మాన్ ఖాన్ పై కేసు పెడతారు.. మనసు విరిగిపోయిన ఐశ్వర్యరాయ్ చివరికి సల్మాన్ ఖాన్ ను వివాహం చేసుకోకుండా అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంటుంది. ఇక అలా ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ విడిపోవడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version