సమంత మరో సంచలన పోస్ట్… అదే అతి పెద్ద గుణపాఠం !

-

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం.. బ్యాచిలర్ లైఫ్ లో చాలా ఎంజాయ్ చేస్తోంది సమంత. అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ… ఏదో ఒక విషయం పై పోస్టులు పెడుతూనే ఉంది. అలాగే వరుస సినిమాలతో కూడా దూసుకుపోతోంది సమంత. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో సమంత షేర్ చేస్తున్న సూక్తులు ఈమధ్య బాగా వైరల్ అవుతున్నాయి.

ప్రేమ, నిజం, ధర్మం, రాక్షసులు, మంచివారు అంటూ ఏదో ఒక విషయం మీద మంచి మంచి సూక్తులు పెడుతోంది సమంత. ఇక తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మరో సూక్తిని షేర్ చేసింది ఈ భామ. ” జీవితంలో నేను నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం ఏమిటంటే… నేను ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది” అనే పోస్ట్ లు షేర్ చేసింది సమంత. ఇటీవలే ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రెండు కోట్లు దాటిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version