సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై రేప్ కేసు… మేల్ బాడీగార్డ్ పై అత్యాచారం…!

-

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలన కలిగించింది. పలు భూవివాదాల్లో పలువురిని మోసం చేసినట్లు ఇదివరకే కేసులు నమోదయ్యాయి. పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకపోవడంతో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని అడిగినందుకు బెదిరించాడని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే తాజా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

సంధ్య శ్రీధర్ తనఫై రేప్ చేసాడని బాడీగార్డ్ ఆర్య చౌదరి ఫిర్యాదు చేశారు. తనను లొంగదీసుకుని రేప్ చేసాడని సనత్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మేల్ బాడీగార్డ్‌పై అత్యాచారం చేసిన శ్రీధర్‌రావు… ఈ విషయాన్ని ఎవరికి చొప్పొదంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీధర్‌రావు వద్ద బాడీగార్డ్‌గా చేరక ముందు ఆర్య చౌదరి జిమ్ ట్రైనర్‌గా పనిచేసేవాడు. అక్టోబర్ నుండి శ్రీధర్ దగ్గర బాడీ గార్డ్‌గా పనిచేస్తున్నారు. తనపై అత్యాచారం చేసిన సంధ్య శ్రీధర్‌ఫై చర్యలు తీసుకోవాలని ఆర్య సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన విచారిస్తున్న పోలీసులు  శ్రీధర్‌పై 377,341,323,506 ఐపీసీ కింద కేసులను నమోదు చేశారు.

ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం, బాధితుడు అక్టోబర్ 3న రావుకు బాడీగార్డ్ చేరాడు, ఐదు రోజుల తర్వాత అక్టోబర్ 8న శ్రీధర్ రావు తన స్నేహితులను స్టార్ హోటల్ నుండి పికప్ చేసుకుని క్లబ్‌లో డ్రాప్ చేసి మళ్లీ హోటల్‌కు రమ్మని కోరాడు. అనంతరం శ్రీధర్ రావు నివాసానికి రావాలని కోరాడు “తనకు వెన్నునొప్పి ఉందని, మసాజ్ చేయమని శ్రీధర్ రావు అడిగాడని బాధితుడు పేర్కొన్నాడు. జిమ్ ట్రైనర్‌గా ఉండటం మరియు ఫిజియోథెరపీపై అవగాహన ఉండటంతో అంగీకరించి మసాజ్ చేయడం ప్రారంభించానని, ఆ సమయంలో రావు కొన్ని మాత్రలు తీసుకోవడం గమనించానని పోలీసులకు బాధితుడు తెలిపారు. అకస్మాత్తుగా, శ్రీధర్ రావు బలవంతం చేయడం ప్రారంభించాడని, కత్తితో బెదిరించి బట్టలు చింపేసి, చంపేస్తానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version