సర్దార్​ టైటిల్​తో వచ్చిన సినిమాలు.. హిట్టా.. ఫట్టా.. ఓసారి చూద్దాం!

-

స‌ర్దార్.. ఈ పదం వినడానికి ఎంతో పవర్​ఫుల్​గా ఉంటుంది. ఇటీవలే తమిళ హీరో కార్తి ఈ పేరుతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్​ టాక్​ను అందుకున్నారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓసారి ఆ సినిమాలు ఏంటి? అవి బాక్సాఫీస్​ ముందు ఎలా ఆడాయి తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటగా సర్దార్ అనే పేరుతో వచ్చిన చిత్రం ‘సర్దార్ పాపారాయుడు’. దాస‌రి నారాయ‌ణరావు ద‌ర్శ‌క‌త్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా స‌ర్దార్ పాపారాయుడు వ‌చ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్​కు జోడీగా శ్రీదేవి నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యంలో నటించి ప్రేక్షకులను అలరించారు. 1980లో దీపావళి కానుకగా విడుదలైన సర్దార్ పాపారాయుడు బ్లాక్ బ‌స్ట‌ర్​గా నిలిచి భారీ వ‌సూళ్ల‌ను అందుకుంది.

1987లో రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా భాస్క‌ర రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం స‌ర్దార్ ధ‌ర్మ‌న్న. ఈ సినిమాలో కృష్ణంరాజు సరసన రాధిక‌, జ‌య‌సుధ హీరోయిన్స్​గా న‌టించారు. ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాలేకపోయింది.

ఇక సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా ఏ. కోదండిరామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 1987లో స‌ర్దార్ కృష్ణ‌మ‌నాయుడు సినిమా విడుదలైంది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి హీరోయిన్​గా నటించారు. ఊర్వ‌శి, శార‌ద‌ ముఖ్య‌పాత్ర‌లలు పోషించారు. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి బాక్సాఫీస్ ఆడలేకపోయింది.

2016లో కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇక తాజాగా తమిళ హీరో కార్తీ నటించిన చిత్రం సర్దార్. ఇటీవలే దీపావళికి విడుదలై ఆశించిన స్థాయిలో కాకపోయినా పాజిటివ్​ టాక్​ను తెచ్చుకుంది. కార్తీ ద్విపాత్రాభినయం పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version