ట్రెండ్ ఇన్: మహేశ్ మేనియా స్టార్ట్..రికార్డుల వేటలో ‘సర్కారు వారి పాట’

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేశ్ కు జోడీగా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ఈ నెల 7న జరగుతుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పిక్చర్ రిలీజ్ కు ఇంకా కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో మహేశ్ బాబు- కృష్ణ అభిమానులు హడావిడి షురూ చేశారు. ఈ నెల 7న జరిగే ఈవెంట్ కు హాజరయ్యేందుకు మహేశ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఎలాగైనా ఈవెంట్ పాస్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిజిటల్ ప్రమోషన్స్ చేస్తున్నారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ లో #SarkaruVaariPaata , #SVPMania, #SVPPreReleaseEvent సర్కారు వారి పాట ,ఎస్ వీపీ మేనియా, ఎస్ వీపీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హ్యాష్ ట్యాగ్స్ తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్స్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో దర్శకులు పరశురామ్, హీరోయిన్ కీర్తి సురేశ్, రాం-లక్ష్మణ్ మాస్టర్స్, ఆర్ట్ డైరెక్టర్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

===============

================
https://www.instagram.com/p/CdICmHfvoCm/?utm_source=ig_web_copy_link

 

=========
telugu 360

 

Read more RELATED
Recommended to you

Latest news