గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు : సత్యవతి రాథోడ్‌

-

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. గూడూరు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండల బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన పొనుగోడు గ్రామ సర్పంచ్ నలమాస వెంకన్న చిత్రపటానికి మంత్రి పూలమాల వెలిసి నివాళులు అర్పించి మాట్లాడారు.67 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, తొమ్మిదేళ్లుగా కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కరెంట్‌ లేక అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మళ్లీఅ అలాంటి పరిస్థితిలు రావద్దు అంటే బీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. గత పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారే తప్పా అభివృద్ధి చేయలేదు.

సోమ వారం(నిన్న) ఆమె తెలంగాణ భవన్​లో మాజీ ఎంపీ ప్రొఫెసర్​ సీతారాం నాయక్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఎస్టీలకు అండగా నిలిచారని.. తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలు చేశారని, 6 శాతమున్న రిజర్వే షన్లను 10 శాతానికి పెంచారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఆచ రణ సాధ్యం కాని హామీలతో ఓట్లు పొందాలని చూస్తున్నాయని విమ ర్శించారు. విభజన చట్టంలోని ట్రైబల్​ వర్సిటీ హామీపై కేంద్రం నోరు మెదప లేదని, ఎన్నికలు వస్తున్నాయని వర్సిటీ పేరుతో హడావుడి చేస్తున్నదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version