గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డాగా సత్తుపల్లి.. ఏపీ టు తెలంగాణ!

-

రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిసర ప్రాంతంలోని ఆంధ్రా సరిహద్దుల్లో గంజాయి గుప్పుమంటోంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల బోర్డర్ అయిన ఆవులపాక నుంచి గంజాయిని కొందరు యువకులు బైకులు, కార్లపై విచ్చలవిడిగా రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు.వారం కిందట సత్తుపల్లిలో గంజాయి రవాణా, విక్రయం కేసులో 11 మంది అరెస్టు అయిన విషయం తెలిసిందే. వారితో పాటు గంజాయి సేవిస్తున్న 82మందిని గుర్తించారు. వారం పాటు కౌన్సిలింగ్ సైతం ఇచ్చారు.

గంజాయి తీసుకున్న వారిలో 82 మందిలో 8 మంది మైనర్లు కూడా ఉన్నారని సమాచారం.గంజాయి రవాణాకు వినియోగించిన బైకుల్లో ఒకటి దొంగిలించినది ఉండటం విశేషం.అంతేకాకుండా, ఇటీవల వీఎం బంజర్ గ్రామం పెనుబల్లి పీఎస్‌లో నాగార్జునసాగర్ కాల్వ సమీపంలో నలుగురు గంజాయి సేవిస్తున్న యువకులను అరెస్ట్ చేశారు.గత నెలలో భద్రాచలం నుంచి గుంటూరుకు టూ వీలర్‌పై 5 కేజీల గంజాయిని తరలిస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేట గ్రామానికి చెందిన ఇద్దరిని పట్టుకున్నారు. రీసెంట్‌గా గంజాయి స్మగ్లర్స్ రూట్ మార్చి ఒడిశా నుంచి వచ్చే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ తరలిస్తుండగా..మధిర ఎక్సైజ్ పోలీసులు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version