పునీత్‌కు మరో గౌరవం.. ‘కేజీఎఫ్ 3 శాట్’కు పునీత్ పేరు

-

దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది.కర్ణాటకలోని ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు
రూపొందించిన కేజీఎస్‌3 శాట్‌కు దివంగత కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టారు. పునీత్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ‘కన్నడ రత్న’ పురస్కరాన్ని ప్రకటించి ఆయన భార్యకు అందజేసింది. తాజాగా, కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన ‘కేజీఎఫ్ 3 శాట్’కు పునీత్ పేరు పెట్టారు.

Prakash Raj donates free ambulance in memory of Puneeth Rajkumar; late  actor to be honoured with Karnataka Ratna on Nov 1

ఈ ఉపగ్రహాన్ని ఈ నెల చివర్లో తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్‌వీ-సి 54 రాకెట్ ద్వారా నింగిలోకి పంపి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news