మేడం మీ వేలు బాగుందన్నా లైంగిక వేధింపే.. కోర్టు సంచలన తీర్పు..!

-

ముంబయి లోని సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇలా చెప్పినా సరే అది లైంగిక వేధింపు లెక్కే అని అంది. ఇక పూర్తి వివరాలని చూస్తే… వేధింపుల విషయంలో ముంబయి లోని సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మహిళా సహోద్యోగిని ఉద్దేశించి ఫిగర్ బాగుందని చెప్పినా కూడా అది వేధింపులగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. డేటింగ్‌కు రమ్మనడం లేదంటే బాగా మెయింటెయిన్‌ చేస్తున్నారనడం కూడా అశ్లీల పదజాలం కిందకే వస్తుంది అని అంది కోర్టు.

ఇలాంటివి చెప్పడం ఆమె గౌరవానికి భంగం కలిగిస్తాయని అన్నారు. ఇవి చెప్పారంటే ముందస్తు బెయిల్‌కు అర్హులు కారని చెప్పేసారు. నిందితులను కస్టడీలోనే విచారించాల్సి ఉంటుందని అన్నారు. సెషన్స్ కోర్టు జడ్జి ఏ.జడ్. ఖాన్‌ ఉత్తర్వులు వెలువరించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో ఫ్రంట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఓ మహిళా పని చేస్తున్నారు. ఆమెని అదే కంపెనీ లో పని చేస్తున్న అసిస్టెంట్‌ మేనేజర్‌(42), సేల్స్‌ మేనేజర్‌(30) లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

ఆమె ని ఫిగర్ బాగుందని, డేట్‌కు వస్తావా అని అనడం తో ఆమె ఏప్రిల్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వాళ్లపై లైంగిక వేధింపులు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ముందస్తు బెయిల్‌ కోసం ట్రై చేసారు. కానీ సెషన్స్ కోర్టు నిరాకరించింది. పనిచేసే చోట మహిళా ఉద్యోగిని వేధించడం తీవ్రమైన విషయము. మార్చి 1 నుంచి ఏప్రిల్ 14 మధ్య అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ మేనేజర్లు అభ్యంతరకమైన పదాలతో ఆమె ని వేధించారు అని ఆమె చెప్పారు. ఆమె తో మేడమ్ మీరు బాగా మెయింటెయిన్ చేస్తున్నారు, మీ ఫిగర్ చాలా అందంగా వుండండి, నాతో బయటకు వచ్చే ఉద్దేశం ఉందా వంటివి అన్నారని ఆమె చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version