కరోనా సమయంలో తల్లిదండ్రులని కోల్పోయిన వారికి స్కాలర్ షిప్లు…!

-

కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులని కోల్పోయారు. దీనితో వాళ్లకి కష్టాలు రావడం.. చదువులు కూడా అర్థంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇంటి పెద్దలను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు కొన్ని స్కాలర్ షిప్స్ ని అందిస్తున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే..

కొటక్ శిక్ష నిధి స్కాలర్ షిప్:

కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా కుటుంబంలో సంపాధించే వారిని కోల్పోయిన వాళ్లకి ఈ స్కాలర్ షిప్. మొదటి తరగతి నుంచి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే వారు అర్హులు. వయస్సు 6 నుంచి 22 ఏళ్లు ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు వచ్చే ఏడాది మార్చి 31 ఆఖరి తేదీ. అప్లికేషన్ లింక్ https://kotakeducation.org/kotak-shiksha-nidhi/

HDFC బ్యాంక్ పరివర్తన్ సపోర్ట్ స్కాలర్ షిప్:

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ఈ స్కాలర్ షిప్. క్లాస్ 1 నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు నవంబర్ 30ని ఆఖరి తేదీ. అప్లికేషన్ లింక్ www.b4s.in/it/CCSS1

డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్‌షిప్:

ఇది కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అందిస్తున్నారు. నవంబర్ 31ఆఖరి తేదీ.
అప్లికేషన్ లింక్ www.b4s.in/it/DBCS1.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version