BREAKING : ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభం : మంత్రి సబితా

-

పాఠశాలల పునః ప్రారంభం పై కేసీఆర్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం లోని విద్యా సంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలోనే.. పాఠశాలలను పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే.. తరగతులు నడిపించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమకు ముఖమ్యమని చెప్పారు.

కాగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు మరియు విద్యా సంస్థలకు కేసీఆర్ సర్కార్ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే విద్యా సంస్థలకు జనవరి 16వ తేదీ నుంచి సెలవులను 31వ తేదీ వరకు పొడిగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version