నెట్ ఫ్లిక్స్ లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్..బాలల హక్కుల సంఘం సమన్లు

-

“లైంగిక అసభ్యకరమైన కంటెంట్” మైనర్లకు అందుబాటులో ఉంచుతున్నారనే ఆరోపణలపై నెట్‌ఫ్లిక్స్‌కి బాలల హక్కుల సంఘం సమన్లు జారీ చేసింది.అసభ్యకరమైన కంటెంట్ చూపుతున్నారని నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇవాళ నెట్ ఫ్లిక్స్ అధికారులకు సమన్లు జారీ చేసింది.

అయితే, ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ ఏమి స్పందించలేదు. మంగళవారం నెట్‌ఫ్లిక్స్ అధికారులకు రాసిన లేఖలో మైనర్లకు అందుబాటులో అసభ్యకరమైన లైంగిక కంటెంట్ ఉంచడం ”లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పొక్సో)చట్టం-2012” ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.ఇదే విషయంపై గతంలో జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు లేఖ రాశామని, అయితే ఎలాంటి స్పందన రాలేదని NCPCR వెల్లడించింది. సీపీసీఆర్ 2005 సెక్షన్ 14 ప్రకారం జూలై 29 మధ్యాహ్నం 03 గంటలకు ఈ విషయంలో తీసుకున్న చర్యల వివరాలతో నెట్ ఫ్లిక్స్ వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని లేఖలో ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version