బిగ్ బాస్ ఫ్రేమ్ షణ్ముక్ కు సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేళ అభిమానులకు షాక్ ఇస్తూ..వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే.. తాజాగా దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీప్తి తో బ్రేక్ అప్ కు సిరి కారణం కాదని… బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సిరితో చనువుగా ఉన్నాను అని… తనపై వ్యతిరేకతను పెరగడానికి అదే కారణమని తాను అనుకుంటున్నానని చెప్పాడు.
అప్పటికే తాను దీప్తితో అలాగే శ్రీ హన్ తో సిరి రిలేషన్ షిప్ లో ఉన్నామని గుర్తు చేశాడు. ఈ క్రమంలో సిరి తో కాస్త చనువు పెరగడంతో అందరిలోనూ తనపై వ్యతిరేకత పెరిగిందని పేర్కొన్నారు షణ్ముఖ్. తన వల్ల దీప్తి నెగిటివిటీ ని ఎదుర్కోవద్దని తెలిపాడు. నెటిజన్లు తనను ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా దీప్తి తనని సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు.
ఈ విషయంలో అందరి నుంచి దీప్తి ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని… ఆ ఒత్తిడిని ఆమె నుంచి దూరం చేసేందుకే తాళం బ్రేకప్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. ప్రస్తుతానికి తామిద్దరం కెరీర్ పై దృష్టి పెట్టామని… భవిష్యత్తులో తాము కలిసేది దేవుడి చేతిలో ఉందని చెప్పాడు.