వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి అరెస్టు అయ్యారు. కాసేపటి క్రితమే… ఆమెను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వైఎస్ షర్మిలను… నేరుగా బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో..ఉద్యోగాల భర్తీ చేయాలనే ముఖ్యమైన డిమాండ్‌తో… ఇవాళ టీఎస్పీఎస్ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల భైఠాయించారు.
వెంటనే తెలంగాణ రాష్ట్రంలో,,, ఖాళీగా ఉన్న ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్ తో… టీఎస్పీఎస్ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల భైఠాయించారు. అయితే.. అక్కడి పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల ను అరెస్టు చేసి.. బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు పోలీసులు.ఇక అరెస్టు అయిన అనంతరం.. కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఉద్యోగాల భర్తీ కోసం డిమాండ్ చేస్తే.. అరెస్ట్ చేయడమేంటని నిలదీశారు. కేసీఆర్ అంతు చూస్తామని హెచ్చరించారు.