మూడు రోజుల్లో 300కోట్లు బాలీవుడ్ లో షారుఖ్ కొత్త రికార్డ్.!

-

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళ నుండో బాలీవుడ్ వారు వెయిట్ చేస్తున్న విజయం లభించింది అని సంబరాలు చేసుకుంటున్నారు.

దీపికా పడుకునె, జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ సినిమా అన్ని చోట్లా  అన్ని రకాల భాషల్లో మల్టీప్లెక్స్‌, సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీకి సిద్ధార్ధ్ ఆనంద్ కధ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్ధ యష్‌రాజ్ పిల్మ్స్ నిర్మించింది.

లేటెస్ట్ గా అయితే ఈ మూడు రోజులలో ఈ చిత్రం ఏకంగా 313 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి  బాలీవుడ్ లో రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తుంది. హిందీలో ఈ చిత్రానికి మూడో రోజు 38 కోట్లు వసూలు చేయగా 300 కోట్ల గను ఈజీ గా చేరుకుంది. అయితే బాలీవుడ్ హిస్టరీ లోనే ఫాస్టెస్ట్ రికార్డు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version