IND vs PAK : టాస్ సమయంలో రవిశాస్త్రి ఘోర తప్పిదం.. వీడియో వైరల్‌

-

ఆసియా కప్ 2022 లో భాగంగా భారత్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో గెలుపొందిన పాకిస్తాన్ కు గట్టి షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంలో గందరగోళం నెలకొంది. టాస్ వ్యాఖ్యాతగా భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి వచ్చాడు.

రోహిత్ శర్మ వేయగా, బాబర్ హజం టైయిల్స్ అంటూ పలికాడు. కానీ రవి శాస్త్రి మాత్రం హెడ్స్ అంటూ మైకులో చెప్పాడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో రచ్చకు తావిచ్చింది. ఇక టాస్ లో బాబర్ అజం గెలిచాడు. అయితే అక్కడ హెడ్స్ పడిందా, లేక టేయిల్స్ పడిందా అనేది సుస్పష్టంగా ఉంది. ఆసియా కప్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుందన్న సంగతి తెలిసిందే.

హాంకాంగ్ ఆడిన మ్యాచ్ లను మినహాయిస్తే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే విజయాలను సాధిస్తూ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కామెంటరిలో ఎంతో అనుభవం ఉన్న రవి శాస్త్రి టాస్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటాడు. టాస్ విషయంలో రవి శాస్త్రిని భారత అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version