పర్వదినాలు, పండుగ దినాల్లో రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, మత ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసు శాఖ యోచిస్తుంది. ఈ క్రమంలో ఈనెల 23న హైదరాబాద్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు వైన్స్లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు.ఒకవేళ నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఇక వైన్స్ బంద్ ఉంటాయని తెలుసుకున్న మద్యం ప్రియులు.. దగ్గర్లో ఉన్న మద్యం దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. రేపటి కోటా కూడా ఈరోజే కొనుగోలు చేసుకుంటున్నారు. ఎండను కూడా లెక్కచేయకుండా వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.