ఛార్మీ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్..!

-

ఛార్మీ కౌర్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ.. ఇంకొక వైపు హీరోయిన్ గా తన గుర్తింపును చాటుకుంది. ఈమె నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా మరింత మంచి ఇమేజ్ను కూడా తీసుకొచ్చాయి ఇక చార్మికౌర్ ప్రస్తుతం హీరోయిన్ నుంచి ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే స్థాయికి ఎదిగింది అంటే ఏ రేంజ్ లో ఆస్తులను కూడా పెట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె దగ్గర ఉన్న నికర ఆస్తుల విలువ గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.

ఛార్మీ అసలు పేరు సురదీప్ కౌర్ .. మహారాష్ట్రలోని వసాయ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ వయసు 34 సంవత్సరాలు . ఇక ఇప్పటికి ఇంతే అందంతో యంగ్గా కనిపించడం అందరి ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు. కార్మలైట్ కాన్వెంట్ ఇంగ్లీష్ హై స్కూల్ మహారాష్ట్రలో తన స్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. సెయింట్ జోన్స్ కాలేజ్ ముంబైలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. సినిమాలలో హీరోయిన్గా నటించే సమయంలో రూ.27 లక్షల పారితోషకం తీసుకునేవారు. ఇక జ్యోతిలక్ష్మి సినిమాలో వ్యాంప్ పాత్ర పోషించినందుకు 60 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు . కానీ నటనకు స్వస్తి పలికినా నిర్మాతగా సొంత ప్రొడక్షన్ బ్యానర్ ను ఏర్పాటు చేశారు. ఇస్మార్ట్ శంకర్ ద్వారా నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకుంది ఛార్మీ.

కార్ గ్యారేజ్ లో ఉండే కార్ కలెక్షన్ విషయానికొస్తే సుమారుగా 20 కోట్ల రూపాయల ఖరీదు చేసే కార్ కలెక్షన్ ఈమె సొంతమని చెప్పవచ్చు. ప్రస్తుతం ముంబైలో కుటుంబంతో కలిసి జీవిస్తున్న చార్మి హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చినప్పుడు హైదరాబాదులోని గచ్చిబౌలి లో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ లో ఉంటారు. ఇక ప్రస్తుతం ఈమె ఆస్తి 250 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. తాజాగా పాన్ ఇండియా సినిమా లైగర్ సినిమాతో హిట్ కొట్టే ప్రయత్నంలో ఉంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version