విశ్వక్ సేన్ గామి కి 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్..!

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ,సమద్‌ మరియు హారిక ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గామి’ మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో తెలంగాణ, ఏపీ లో ఆడియన్స్ నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే లభించాయి. అయితే, 4వ రోజు వర్కింగ్ డే కావడంతో రెస్పాన్స్ చాలా వరకూ తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో రూ. 51 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

ఓవరాల్గా ‘గామి’ మూవీకి ఆంధ్రా, తెలంగాణలో నాలుగు రోజుల్లో రూ. 6.62 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ చిత్రం కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 76 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 9.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది.ఇక, ఈ మూవీకి 4 రోజుల్లోనే రూ. 9.53 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.47 కోట్లు రాబడితేనే ఈ చిత్రం క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version