గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్..!!

-

సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్లుగా కొంతమంది కొనసాగుతుంటే, మరికొంతమంది హీరోలుగా కొనసాగుతున్నారు. ఇంకొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకే పరిమితమైతే.. ఇంకొంతమంది పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు అని చెప్పవచ్చు. కానీ ఇటీవల కాలంలో గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు తమ అందాలను ఆరబోస్తూ సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో గంగోత్రి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు. వల్లంకి పిట్ట పాటకు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతో చక్కగా ఆకట్టుకున్న ఈ చిన్నారి పేరు కావ్య.

ఇక ఈ చిన్నారి గంగోత్రి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలో కూడా నటించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇక చైల్డ్ ఆర్టిస్టుగా అప్పట్లోనే వరుస సినిమాలలో నటిస్తూ బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తింపు పొందిన ఈ చిన్నారి విజయేంద్ర వర్మ, అందమైన మనసు , అడవి రాముడు లాంటి చిత్రాలలో కూడా నటించి సుమారుగా 12 సినిమాలలో ప్రేక్షకులను అలరించింది. ఇక భవిష్యత్తు రీత్యా ఈ పాపను తన తల్లిదండ్రులు సినిమాలను మాన్పించి ఉన్నత చదువులకు పంపించారు.. ఇక అలా సినిమాలపై ఆసక్తి ఉన్నప్పటికీ కొద్ది రోజుల గ్యాప్ తీసుకొని పూణేలో లా పూర్తి చేసి లేడీ వకీల్ సాబ్ గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక లాయర్ గా పనిచేస్తున్నప్పటికీ సినిమాలపై తన మక్కువ పోలేదని చెప్పవచ్చు.

సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు చదువుతోపాటు యాక్టింగ్ , డాన్స్ లో కూడా శిక్షణ తీసుకుంది. ఇక పూణేలో ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. అక్కడ ఇంటర్వ్యూలో భాగంగానే ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాలు చాలానే చూస్తూ ఉంటాను . నాకు సినిమాలో నటించడం అంటే చాలా ఇష్టం. కానీ సినిమాలలో నటించడం వల్ల చదువుకోలేదని బాధ ఉండకూడదు కదా! అందుకే చదువు పూర్తి చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తాను అంటూ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రాధాన్యత ఉన్న పాత్ర వస్తే కచ్చితంగా రీఎంట్రీ ఇస్తానని చెబుతోంది కావ్య.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version