BRAKING : ఉక్రెయిన్‌ లో మరో భారతీయుడిపై కాల్పులు

-

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ప్రాంతంలో మరో దారుణం చోటు చేసుకుంది. కీవ్‌ ప్రాంతంలో మరో భారతీయుడిపై కాల్పులు జరిగాయి. ఉక్రెయిన్‌ ఆర్మీ పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో.. మన ఇండియన్‌ పై బులెట్ల వర్షం కురిసింది. ఈ విషయాన్ని మన దేశ కేంద్ర మంత్రి వీకే సింగ్‌ అధికారికంగా ప్రకటన చేశారు.

రష్యా కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్‌ వెల్లడించారు. కీవ్‌ ప్రాంతం నుంచి వెళ్లి పోవాలని భారత ఎంబసీ ఇప్పటికే సూచించిందని కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మరోసారి గుర్తు చేశారు.

యుద్ధ సమయంలో బుల్లెట్‌ జాతీయత, ప్రాంతాన్ని చూడదని వెల్లడించారు. కాబట్టి ఇండియన్స్‌ అందరూ కీవ్‌ ప్రాంతాన్ని వెంటనే వదిలి పెట్టి.. బయటకు వెళ్లాలని సూచనలు చేశారు. రష్యా దేశం కీవ్‌ ప్రాంతాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని.. ఇలాంటి సమయంలో.. అక్కడ ఉండటం ఏ మాత్రం క్షేమం కాదని పేర్కొన్నారు కేంద్ర మంత్రి వీకే సింగ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version