అందమైన కురులని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇది చూడాల్సిందే. కేవలం మనం జుట్టని మెయింటైన్ చేయాలంటే ప్రొడక్ట్స్ ని వాడితే సరిపోదు ఆహారం విషయంలో కూడా మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకోవడం వలన జుట్టు బాగా ఒత్తుగా ఎదుగుతుంది. పొడవుగా కూడా ఎదుగుతుంది మనం తీసుకునే ఆహారం బట్టి మన జుట్టు పెరుగుదల ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అరటిపండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అరటి పండ్లు తీసుకుంటే జుట్టు ఒత్తుగా పొడవుగా ఎదుగుతుంది.
అరటిపండ్లలో పోషకాలు ఎక్కువ ఉంటాయి అరటిపండు తీసుకుంటే విటమిన్స్ పొటాషియం వంటివి బాగా అందుతాయి కనుక అరటి పండ్లు తీసుకుంటే అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. అవకాడో తీసుకుంటే కూడా అందమైన కురులు పొందవచ్చు. జుట్టు రాలడం వంటి సమస్యలు ఉండవు. దీనితో మాస్క్ వేసుకోవడం వలన కూడా జుట్టు బాగా ఒత్తుగా ఎదుగుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. పొడవాటి కురులు పొందొచ్చు. ఆరోగ్యానికి ఉసిరి చాలా మేలు చేస్తుంది ఉసిరిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఉసిరితో వెంట్రుకలు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఆప్రికాట్ తీసుకుంటే కూడా జుట్టు బాగా ఒత్తుగా పొడుగ్గా ఎదుగుతుంది అందమైన కురులని పొందాలనుకునే వాళ్ళు ఆప్రికాట్ ని కూడా తీసుకుంటూ ఉండండి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బొప్పాయి లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి వెంట్రుకలు ఒత్తుగా పొడవుగా రావడానికి బొప్పాయి బాగా సహాయం చేస్తుంది. పైనాపిల్ తీసుకుంటే కూడా కురులు అందంగా మారతాయి పొడవాటి కురులు ని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు పోషక విలువలతో ఉన్న పైనాపిల్ తీసుకోండి. ఆపిల్స్, స్ట్రాబెర్రీ కూడా అందమైన కురులని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. జామ పండ్లను కూడా తీసుకోవచ్చు.