వైసీపీలో ఉంటే వ్యాపారం చేయకూడదా..? – ఎంపీ వేమిరెడ్డి

-

రేడియంట్ డెవలపర్స్ కు సంబంధించి ఎలాంటి కుంభకోణం లేదని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇది రెండు ప్రైవేట్ పార్టీల మద్య కుదిరిన ఒప్పందమన్నారు. రేడియంట్ సంస్థ తో ఆయనకి 30 సంవత్సరాల నుంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు. ఆయన మైనింగ్ కంపెనీకి స్పేర్ పార్ట్ లు వాళ్ళు సరఫరా చేస్తారని తెలిపారు. రేడియంట్ కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు చూసే ఒప్పందానికి వచ్చామన్నారు.

ఈ ఒప్పందంతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. 2005 నుంచి ఈ వ్యవహారం జరుగుతోందని.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే ఆర్బిట్రేషన్ ద్వారా వచ్చిందన్నారు. 2019 లో చంద్రబాబు ప్రభుత్వం రేడియంట్ కు అనుకూలంగా ఓ జి.ఓ. ఇచ్చిందని తెలిపారు. 2021 లో ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి కొనుగోలు చేసామన్నారు వేమిరెడ్డి. వి.పి.ఆర్.ప్రాజెక్ట్స్ కు రేడియంట్ అమ్మిందని.. జాయింట్ వెంచర్ ద్వారా భూమిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఇందులో ఎలాంటి కుంభకోణం లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వ పరంగా సాయం తీసుకునివుంటే ఎప్పుడో పని పూర్తి అయ్యేదన్నారు. వైసీపీలో ఉంటే వ్యాపారం చేయకూడదా ? అని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం దీనికి జీవో ఇచ్చిందన్న విషయాన్ని మరిచిపోవద్దు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version