రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన శ్రీ లీల..!

-

రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీ లీలా పెళ్లిసందD సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపున సొంతం చేసుకున్న శ్రీ లీల ఎంట్రీ తోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఇక మాస్ మహారాజా ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

అందరితోను ఇంటరాక్ట్ అవుతూ.. చలాకీగా ఉంటూ రిలీజ్ కి ముందే యూత్ మనసులు దోచుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా వచ్చే యేడాది వరుస పెట్టి విడుదల కాబోతున్నాయి. ఇందులో ఏ కొన్ని హిట్ అయినా సరే ఈమె స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ. అయితే తాజాగా శ్రీ లీల తన రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఏ సినిమా ఆఫర్ వచ్చినా, కోటి యాభై లక్షలు వసూలు చేసేందుకు సిద్ధమైందట. అంతకు తక్కువకు ఏ సినిమా చేయబోనని నిర్మాతలకు తేల్చి చెబుతుందట. ధమాకా హిట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుందట శ్రీ లీల.

Read more RELATED
Recommended to you

Exit mobile version