ముంబై: పోర్న్ రాకెట్ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు శిల్పాశెట్టిని పోలీసులు విచారించారు. రాజ్‌కుంద్రా వ్యాపారాలపై ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో శిల్పాకు వాటా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీశారు. రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ కంపెనీ డైరెక్టర్లలో శిల్పా శెట్టి ఒకరిగా ఉన్నారు. ఇటీవలే ఈ కంపెనీ కార్యాలయంపై దాడులు జరిపి భారీగా పోర్న్ వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హాట్ షాట్ కేసు.. శిల్పాకు వాటా ఉందా?.. మరోసారి ప్రశ్నిస్తారా?.
-