మీమ్స్ క్రియేటర్స్ కు ధన్యవాదాలు తెలిపిన సిమ్రాన్ చౌదరి..!

-

ప్రస్తుతం మీమ్స్ , ట్రోల్స్ సోషల్ మీడియాలో ఫన్నీగా అనిపిస్తాయి. సినీనటులపై ఫన్నీగా చేసే మీమ్స్ మనకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ వీటిపై తారలంతా ఒకే రకంగా స్పందించరు. కొందరు చూసిచూడనట్లు వదిలేస్తారు..మరికొందరు సీరియస్ గా రియాక్ట్ అవుతారు. అలాగే మీమ్స్ క్రియేటర్స్ కు నటి సిమ్రాన్ చౌదరి ధన్యవాదాలు తెలిపింది. అసలు ఎందుకు ఇలా చేసింది. తనపై ఈ గ్యాంగ్ ఏం మీమ్ చేశారో..!

sriman

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రన్‌ చౌదరిలు జంటగా గంగాసాగర్‌ ద్వారక దర్శకత్వంలో ‘సెహరి’ తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్‌ పోస్టర్‌ను హీరో నందమూరి బాలకృష్ణ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పోస్టర్‌ విడుదల సందర్భంగా బాలయ్య.. హీరో హర్ష్‌ కనుమిల్లి చేతిని కొట్టినట్లుగా కనిపించాడు. అలాగే కోపంతో ఫోన్‌ విసిరికొట్టి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు.అంతే సోషల్ మీడియాలో ఈ ఫోటోస్ తోఆడేసుకున్నారు. నచ్చినట్లుగా మీమ్స్ రాసి వైరల్ చేశారున.

సినిమా ఫస్ట్ లుక్ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, హీరోయిన సిమ్రాన్ లను ఉద్దేశిస్తూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. ఇవి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై స్పందించిన సిమ్రాన్ అందరికి హాయ్.. ఈ స్టోరీని ప్రత్యేకంగా మీమర్స్ కోసమే పెడుతున్నాను. నిన్న జరిగిన సినిమా ఫస్ట్ లుక్ కార్యక్రమాన్ని మీ మీమ్స్ తో అంతబాగా పాపులర్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్వవాదాలు అని తెలిపింది.. అంతేకాదండోయ్.. తనను ట్యాగ్ చేస్తూ పెట్టే ప్రతి పోస్ట్ ను సిమ్రాన్ చూస్తుందట! అవి తనకు బాగా కామెడిగా అనిపిస్తాయని తెలిపింది.. కరోనా కాలంలో మీరు మీమ్స్ చేసి ప్రజలను సంతోష పెడుతున్నారని మీమర్స్ క్రియోటికి ధన్యవాదాలు తెలిపింది.
ఇక్కడ వరకు బాగానే ఉంది.. సిమ్రాన్ స్టోరీపై ఇప్పుడు మీమర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. కాసింత ఎటకారంగా చురక అంటిన సిమ్రాన్ కు ఎలాంటి మీమ్స్ ఎదురవుతాయో..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version