రామగుండం సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఆరుగురు కార్మికుల మరణం..!

-

సింగరేణిలో ఘోర ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గనిలో ప్రమాదం జరిగింది. రామగుండంలోని ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గనిలో పైకప్పు కూలడంతో ఆరుగురు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. ALP గని లో మధ్యాహ్నం  85 లెవల్ వద్ద పైకప్పు కూలింది. అధికారికంగా ప్రస్తుతం నలుగురు కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ మేనేజర్ తేజతో పాటు మరోముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఐదుగురు కార్మికుల గల్లంతైనట్లు… గల్లంతయిన వారిలో ఒకరికి తీవ్ర గాయాలు సింగరేణి ఆస్పత్రికి తరలించారు. 

గోడపై కప్పు కూలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకన్నట్లు తెలుస్తోంది. విధుల నిమిత్తం గనిలోకి వెళ్లిన కార్మికులు పనిచేస్తున్న చోట పైనుంచి గని పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం సంభవించింది. హఠాత్తుగా పైకప్పు కూలడంతో పెద్ద బండరాళ్లు కార్మికులపై పడ్డాయి. దీంతో వీటి కింది చిక్కుకుని కార్మికులు మరణించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సింగరేణి రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ చేస్తున్నారు. ప్రమాద సమయంలో 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఘటన వివరాలను సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు యాజమన్యా నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటూ కార్మికులు ఆరోపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version