Breaking : సింగరేణి ఆల్ టైం రికార్డ్‌.. డిసెంబర్‌లో 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

-

సింగరేణి ఆల్ టైం రికార్డుగా డిసెంబర్ ఒక్క నెలలోనే 67.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. గత ఏడాది డిసెంబర్ నెల ఉత్పత్తిపై 19 శాతం వృద్ధి చేసినట్లు తెలుస్తోంది. రోజుకు సగటున 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో మరో ఆల్ టైం రికార్డు సాధించినట్లు అధికారులు తెలిపారు. ఇదే ఒరవడితో వార్షికాంతానికి 34 వేల కోట్ల టర్నోవర్, అత్యధిక లాభాల దిశగా సింగరేణి సాగుతోంది. సింగరేణి చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించనున్నామన్నారు అధికారులు. ఇకపై రోజుకు కనీసం 2 లక్షల 30 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్ని ఏరియాల జీఎంల సమీక్ష సమావేశంలో సింగరేణి సీఎండి శ్రీధర్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. బొగ్గు ఉత్పాదన, రవాణాలో సింగరేణి సంస్థ బుధవారం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఉదయం షిఫ్ట్‌ నుంచి మొదలు రాత్రి షిఫ్ట్‌ మధ్య ఉన్న 24 గంటల వ్యవధిలో ఉద్యోగులు, కార్మికులు 2.46 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 2.53 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డును నెలకొల్పి ఇదే నెల 20న నోమోదైన 2.24 లక్షల టన్నుల బొగ్గు బొగ్గు ఉత్పత్తి, 2.35 లక్షల టన్నుల రవాణా రికార్డును తిరగరాసింది. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్‌ అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

ఇదే ఉత్సాహంతో 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలన్నారు. మిగిలిన 90 రోజుల్లో కనీసం 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించగా బుధవారం అన్ని ఏరియాలు కలిపి ఈ లక్ష్యాన్ని దాటాయన్నారు. మణుగూరు ఏరియా తన వంతుగా 64 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి సంస్థ పరిధిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కొత్తగూడెం ఏరియా 51 వేల టన్నులతో రెండోస్థానంలో నిలిచిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news