హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన సింగర్ మంగ్లీ.. పాన్ ఇండియా మూవీలో..!

-

జానపద పాటలకు పెట్టింది పేరు సింగర్ మంగ్లీ.. ఆమె గొంతు నుంచి జాలువారిన ప్రతి పాట కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మంగ్లీ పాడిన పల్లె పాటలకు వస్తున్న ఆదరణ చూసి టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోందని చెప్పవచ్చు. అందుకే మంగ్లీకి సినిమా పాటలు పాడే అవకాశాన్ని కూడా కల్పించింది చిత్ర పరిశ్రమ. ప్రస్తుతం సింగర్ గా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కూడా పాటలు పాడుతూ పాపులారిటీ దక్కించుకున్న ఈమె తాజాగా ధమాకా సినిమా పాటతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఫిలింనగర్లో మంగ్లీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. అదేమిటంటే మంగ్లీ త్వరలోనే ఒక పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి చైల్డ్ ఆర్టిస్టులుగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్లుగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. వీరితో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈమధ్య వెండితెరపైకి హీరో, హీరోయిన్లుగా రంగ ప్రవేశం చేస్తున్నారు . అయితే సింగర్స్ కూడా వెండితెరపై తళుక్కుమని మెరిసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే సింగర్ మంగ్లీ కూడా హీరోయిన్గా కనిపించబోతున్నట్లు సమాచారం.

సింగర్ మంగ్లీ కి కన్నడ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుగు పరిశ్రమలో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ చక్రవర్తి చంద్రచూడ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న కన్నడ చిత్రం పాదరాయా.ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోగా నాగ శేఖర్ కనిపించబోతున్నారు. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాలి అంటే దీనిపై మంగ్లీ స్పందించాల్సి ఉంటుంది. ఇదే నిజమైతే హీరోయిన్ గా కూడా మంగ్లీ సత్తా చాటినట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version