ప్రముఖ సీనియర్ నటి స్నేహ గురించి.. ఆమె అందం, అభినయం, నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎన్నో సినిమాలలో నటించి మరింత పాపులారికి దక్కించుకున్న ఈమె పలు వాణిజ్య ప్రకటనలలో కూడా నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరవుతోంది. తన సహజ నటనతో తెలుగు తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తమిళంలో కమలహాసన్ ,అజిత్ , ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది. వెంకటేష్ , రవితేజ, నాగార్జున నటించిన స్నేహ.. నటుడు ప్రసన్నను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.
2012లో వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం అనంతరం స్నేహ నటించిన కొనసాగిస్తుంది. ఇకపోతే వైవాహిక బంధం లో ప్రసన్న, స్నేహ సంతోషంగా ఉన్నారు. కానీ రెండు నెలలుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.. అయితే ఇదంతా అబద్ధమని స్నేహ సన్నిహితులు కొట్టి పారేశారు. అయినా ఎవరు నమ్మలేదు. అయితే ఈ విషయంపై నేరుగా రంగంలోకి దిగిన స్నేహ తన భర్తతో ఆప్యాయంగా కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలా తన వైవాహిక జీవితం పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఏది ఏమైనా ఈ ఫోటోలో కూడా హీరోయిన్ స్నేహ ఇంకా హీరోయిన్ గానే కనిపిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రసన్న కూడా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి మీరు విడాకులు తీసుకోవడం లేదని తెలిసి అభిమానులు సంతోషిస్తున్నారు.