లిప్‌స్టిక్‌ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. అమ్మాయిలు.. ఇక తగ్గేదేలే..!

-

ఆడవారి సౌందర్య సాధనాలలో ఒకటైన లిప్‌స్టిక్‌.. వారి అందాన్ని మరింత పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరూ చెప్తుంటారు. అయినా వేసుకునే వాళ్లు మానరు. బయటకు వెళ్తున్నామంటే.. లిప్‌స్టిక్‌ వేసుకుని పర్ఫ్యూమ్‌ కొట్టకోవాల్సిందే. మాస్కు వేసుకున్నా సరే.. పేదాలకు లిప్‌స్టిక్‌ ఉండాలని అనుకుంటారు కొందరు అమ్మాయిలు.. అయితే.. ఎప్పుడూ లిప్‌స్టిక్‌ గురించి నెగిటివ్‌ న్యూస్‌ చెప్పుకుంటాం.. అది వేసుకుంటే.. కెమికల్స్‌ లోపలికి వెళ్తాయి.. హెల్త్‌ కరాబ్‌ అవుతుంది ఇలా.. కానీ కొత్తగా లిప్‌స్టిక్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా..!

లిప్ స్టిక్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

UV కిరణాల ..

పెదవులపై ఉన్న లిప్‌స్టిక్ వాటిని UV కిరణాల నుండి రక్షిస్తుంది. పెదవులు టాన్ అవ్వకుండా చేస్తుంది. కానీ మంచి కంపెనీవి.. కెమికల్‌ కంటెంట్‌ తక్కువ ఉన్నవి మాత్రమే వాడాలి.

ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి..

లిప్ స్టిక్ వేసుకునే మహిళల్లో ఆత్మవిశ్వాసం ఉంటుందని పరిశోధనలో తేలింది. లిప్‌స్టిక్ వేయని మహిళల కంటే కూడా వారు మెరుగ్గా పని చేస్తారు. అంతే కాదు లిప్ స్టిక్ స్త్రీల మూడ్‌ను కూడా పెంచుతుందట.

పెదాలను తేమగా చేస్తాయి..

మీరు మంచి కంపెనీ లిప్‌స్టిక్‌ లను కొనుగోలు చేస్తే, వాటిలో విటమిన్ ఇ లేదా అలోవెరా వంటి కొన్ని మాయిశ్చరైజింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి మీ పెదాల తేమను గాలిలో ఆవిరికాకుండా కాపాడతాయి. పెదాలను మృదువుగా ,హైడ్రేట్‌గా ఉంచుతాయట.

మానసిక స్థితి..

మహిళలు పెదవులపై లిప్‌స్టిక్‌ను వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వారు సంతోషంగా ఉంటారుట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఈ మాటకు మాత్రమ లిప్‌స్టిక్‌ వేసుకునే మహిళలు కచ్చితంగా ఏకీభవిస్తారు. ఎందుకంటే చాలాసార్లు తమకు నచ్చిన కలర్‌ లిప్‌స్టిక్‌ వేసుకుని ఆ హ్యాపీనెస్‌ను ఎంజాయ్‌ చేసే ఉంటారు.

శరీరాకృతి ..

లిప్‌స్టిక్‌ను డైలీ వాడే వారికి.. శరీరాకృతి దీర్ఘకాలం పాటు మెరుగ్గా ఉంటుందని పరిశోధనలో కనుగొన్నారు. వారు అద్దంలో తమను తాము ఎక్కువగా చూసుకుంటారని, దీని వల్ల వారి శరీరం ,ఆకృతి గురించి వారు మరింత తెలుసుకుని స్లిమ్‌గా ఉండేలా వారికి వారే మోటివేట్‌ అయి మంచి డైట్‌ ఫాలో అవుతారట.
సో లిప్‌స్టిక్‌ వల్ల లాభాలు కూడా బానే ఉన్నాయి. అయితే లిప్‌స్టిక్‌ అంటే ఎప్పుడో ఓసారి కొంటాం కాబట్టి.. కాస్త ఖరీదైనదే ఎంచుకోవాలి. చిల్లరవి వాడటం వల్ల మీ పేదవులు అందం దెబ్బతినడమే కాదు.. అవి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. మంచి లుక్‌ కూడా రాదు. వేసిన కొద్ది సేపటికే ఫేడ్ అవుతూ వస్తుంది. కాబట్టి లిప్‌స్టిక్‌ కొనే విషయంలో కెమికల్స్‌ లేనివి చూసుకుని తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news