ఆకాశంలో అద్భుతం.. ఈ సూర్యగ్రహణం!

-

ఈ ఏడాది గ్రహణాలు అందరికీ కనువిందు చేయనున్నాయి. మే లో చంద్రగ్రహణాన్ని నారింజ రంగు చందమామను ప్రజలు చూశారు. ఇప్పుడు జూన్‌లో సంపూర్ణ సూర్య గ్రహణం రాబోతోంది. జూన్‌ 10 ఆకాశంలో ఈ అద్భుతం జరగబోతోంది. గ్రహణం రోజున సూర్యుడు, భూమి మధ్యకు చందమామ రాబోతోంది. అందువల్ల సూర్య కిరణాలు చందమామపై పడతాయి. చందమామ నీడ భూమిపై పడుతుంది. ఫలితంగా భూమిపై ఉన్న వారికి సూర్యుడు కనిపించడు. సాధారణంగా ఇలా చంద్రుడు, సూర్యుడికి పూర్తిగా అడ్డుగా వచ్చినప్పుడు, చందమామ చుట్టూ ఓ రింగ్‌ ఏర్పడుతుంది. దాన్నే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అంటున్నారు. అది చాలా కాంతి వంతంగా మెరుస్తూ ఉంటుంది. అది తప్పక చూడాలని అంటున్నారు. పైగా ఈసారి సూర్య గ్రహణం దాదాపు గంటపాటు ఉంటుంది. ఇలాంటి అరుదైన దృశ్యం ఎంతో మానసిక ఉల్లాసం కలిగిస్తుందని చెబుతున్నారు. చాలా దేశాల్లో ఇది కనిపించనుంది.

 

సూర్య గ్రహణాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. సంపూర్ణ సూర్యగ్రహణం, పాక్షిక సూర్య గ్రహణం, వలయాకార (రింగ్‌) సూర్య గ్రహణం. భూమి, చందమామ… గుండ్రంగా కాకుండా… కోడి గుడ్డు ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. అందువల్ల చందమామ మనకు కొన్నిసార్లు చిన్నగా, మరికొన్నిసార్లు పెద్దగా కనిపిస్తుంది. వలయాకార సూర్యగ్రహణం వచ్చినప్పుడు చందమామ భూమికి చాలా దూరంలో ఉంటుంది. అది చిన్నగా కనిపిస్తుంది. జూన్‌ 10న అదే జరగబోతోంది. జూన్‌ 10 నాటి అరుదైన సూర్యగ్రహణం భారతీయులకు కనిపించదు. గ్రీన్‌  ల్యాండ్, ఈశాన్య కెనడా, రష్యాలో కొంత వరకూ పూర్తిగా కనిపిస్తుంది. యూరప్‌ దేశాలు, ఉత్తర అమెరికా, ఆసియా, ఆర్కిటిక్, అట్లాంటిక్‌ ప్రాంతాల్లో కొద్దిగా కనిపించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version