ఇస్రో కొత్త‌ చైర్మెన్ గా సోమ‌నాథ్

-

భార‌త స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ చైర్మెన్ గా సీనియ‌ర్ శాస్త్రవేత్త ఎస్ సోమ‌నాథ్ ను కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. ప్ర‌స్తుతం ఇస్రో చైర్మెన్ గా ఉన్న కె శివ‌న్ ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లోనే ముగియ‌నుంది. దీంతో ఇస్రో నూత‌న చైర్మెన్ గా సీనియ‌ర్ శాస్త్రవేత్త ఎస్ సోమ‌నాథ్ ను కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. కాగ ఎస్ సోమ‌నాథ్ ప్ర‌స్తుతం విక్ర‌మ్ సారా భాయ్ అంత‌రిక్ష కేంద్రం డైరెక్ట‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు.

కాగ గ‌తంలో విక్రం సారా భాయ్ అంత‌రిక్ష కేంద్రం నుంచి విడుద‌ల చేసిన జీఎస్ఎల్‌వీ ఎంకే – 111 ని లాంచ‌ర్ అభివృద్ధి చేయ‌డంలో ఎస్ సోమ‌నాథ్ కీల‌క పాత్ర వ‌హించారు. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు ఇస్రో చైర్మెన్ గా విధులు నిర్వ‌హిస్తున్న కె శివ‌న్.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కె శివ‌న్ ఆధ్వ‌ర్యంలో గ‌తంలో విడుద‌ల అయిన చంద్ర‌యాన్ – 2 విడుద‌ల చేశారు. అయితే ఈ చంద్ర‌యాన్ – 2 ప్ర‌యోగం విఫ‌లం అయినా.. కె శివ‌న్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version