ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై అదే పార్టీకి చెందిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి దూరం కావడానికి సోము వీర్రాజే కారణమని ఆరోపించారు. ఆయన పవన్ కళ్యాణ్ తో సమన్వయం చేసుకోలేకపోయారని విమర్శించారు. పవన్తో సఖ్యత విషయంలో రాష్ట్ర పార్టీ విఫలమైందని ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజు తోనే అని ఆక్షేపించారు.
పార్టీలోని అన్ని విషయాలు సోము వీర్రాజు చూసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. ఏపీ విషయంలో హైకమాండ్ జోక్యం చేసుకోవాలని కోరారు సోము వీర్రాజు. రాష్ట్రంలో ఎవరితో పొత్తులు ఉంటాయో తాను చెప్పలేనన్నారు. మా పార్టీలో అసలు ఏం జరుగుతుందో మాకే తెలియడం లేదు అన్నారు. మొత్తానికి ఏపీ బీజేపీలో విభేదాలు బయటపడుతున్నాయి.