జనన నాట్య మండలి సీనియర్ కళాకారుడు, గేయ రచయిత జంగు ప్రహ్లాద్ మృతి చెందారు. కొద్ది సేపటి క్రితమే… హైదరాబాదు లోని నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు గేయ రచయిత జంగు ప్రహ్లాద్. అయితే…ఇటీవలే…జంగు ప్రహ్లాద్ రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
నిన్నటి వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్న జంగు ప్రహ్లాద్.. ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రజా కవి గా, జన నాట్య మండ లి లో చురుకైన పాత్ర తోపాటు తెలంగాణా ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమిక పోషించారు జంగు ప్రహ్లాద్. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురం కు చెందిన ఆయన హైదరాబాదు లోని జగద్గిరిగుట్ట లో ఉంటున్నారు. కాగా… జంగు ప్రహ్లాద్ మృతి తో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో కి వెళ్లింది. ఇక జంగు ప్రహ్లాద్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు.