చిన్నారిని ఆదుకున్న సోనూసూద్..నెటిజన్స్ ప్రశంసలు..

-

సోనూ సూద్.. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినిమాల కన్నా కూడా ఎక్కువగా బయట ఫెమస్ అయ్యాడు.. సాయం కోరిన వారికి, కష్టాలలో ఉన్న వారికి లేదనకుండా సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. ఇప్పుడు మరోసారి పెద్ద మనసును ఛాటుకున్నాడు..

ఓ చిన్నారి జన్యు లోపంతో రెండున్నరేళ్ల క్రితంలో వింత రూపంతో జన్మించింది. ఆ చిన్నారి పొట్ట దగ్గర అదనంగా రెండు చేతులు, రెండు కాళ్లతో జన్మించింది. చిన్నారికి అదనంగా ఏర్పడిన రెండు చేతులు, రెండు కాళ్లను తొలగించి సాధారణ పిల్లల మాదిరిగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులు భావించారు. అయితే వారి ఆర్ధిక పరిస్థితి పూట గడవటం కష్టం.. ఆర్ధిక సహాయం చేయడమని ఎవరిని కోరినా ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండున్నరఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.. సోనూ సూద్ దృష్టికి చేరుకుంది. తాను ముందుకొచ్చి ఆ చిన్నారికి అవస్థలను తీర్చాడు. వివరాల్లోకి వెళ్తే..బీహార్ లోని నెవాడా జిల్లా నివాసి బసంత్ పాశ్వాన్ కుమార్తె చౌముఖి. జన్యు లోపంతో నాలుగు చేతులు, నాలుగు కాళ్ళతో చౌముఖి జన్మించింది. చిన్నారి వింత ఆకారం చూసి భయపడి ఎవరూ ఆ అమ్మాయిని దగ్గరకు రానివ్వలేదు.. ఆదుకొనేందుకు కూడా భయపడేవారట. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. వింత ఆకారంతో తమ కూతురు పడుతున్న ఇబ్బందులు చూడలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు..

అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం తో అది సొనూసూద్ కు చేరింది. ఇది చూసి చలించి పోయిన అతను చిన్నారికి వైద్యం చేయించడానికి ముందుకు వచ్చాడు.. అతన్ని చూసి చాలా మంది ముందుకు వచ్చారు. ప్రస్తుతం చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు..త్వరలోనే మామూలు మనిషి అవుతుందని వైద్యులు చెబుతున్నారు. సొనూసూద్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version