తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అదనంగా బస్ సర్వీస్ లు నడుపాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేక బస్సులు నడపనుంది టిఎస్ ఆర్టీసీ. సిటీ శివారులో ఉన్న ఈవెంట్స్ జరిగే ప్రాంతలకు బస్సు సర్వీసులు నడుపాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ.
దీని కోసం ఒక్కరికి 100 రూపాయల ఛార్జ్ వసూలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సూచించిన 15 ప్రాంతాలకు ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈవెంట్స్ వెళ్లే వారికోసం రాత్రి 7.30 రాత్రి 9.30 వరకు, తిరుగు ప్రయాణం అర్ధరాత్రి 12.30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటన చేసింది. 18 సీట్ల ఏసి బస్సు వెళ్లి రావటానికి 4000 రూపాయలకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.