సుప్రీం కోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి రాహల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లను ఎందుకు సమర్పించలేదని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. యూకే కేంబ్రిడ్జి వర్సిటీలో రాహుల్చేసిన పెగాసస్వ్యాఖలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్‌పై రాహుల్ ప్రతిసారీ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. దేశాన్ని కించపరిచే కుట్రను కాంగ్రెస్ తెరతీసిందని అభిప్రాయాన్ని అనురాగ్ ఠాకూర్ వ్యక్తం చేశారు. రీసెంట్అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదని రాహుల్‌కు తెలుసునని, దీంతో ఇలాంటి అవాస్తవ ఆరోపణలను చేస్తున్నారని నిందించారు. ప్రధాని మోడీ నాయకుడిగా ఎదిగారని, రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో భారత్ గౌరవం పెరిగిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ.. ఇటలీ ప్రధాని చెప్పిన మాటలు తాను (రాహుల్ గాంధీ) విని ఉండకపోవచ్చని… ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రధాని మోదీని ప్రేమిస్తున్నారని ఆయన అన్నారు.