ఉమేష్ యాదవ్ కు బంపర్ ఆఫర్.. ఇంగ్లాండ్ కు పయనం

-

టీమిండియాలో యువ పేసర్ల హవా పెరగడంతో గత కొంతకాలంగా ఉమేష్ యాదవ్ కు అవకాశాలు రావడం లేదు. ఈ ఏడాది ఐపీఎల్ లో (కేకేఆర్) అంచనాలకు మించి రాణించినా.. అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు. ఉమేష్ తన సహచరుడు పుజారాలా కౌంటీల్లో సత్తాచాటి టీమిండియాకు పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. ఈ సందర్భంలోనే ఉమేష్ యాదవ్ కు బంపర్ ఆఫర్ లభించింది.

పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిద్ ఆఫ్రిది స్థానంలో ఇంగ్లండ్ కౌంటీ టీం మిడిల్సెక్స్ అతని తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అఫ్రీదీ జట్టును వీడడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిడిల్సెక్స్ యాజమాన్యం సోమవారం ప్రకటించింది. ఉమేష్ 2022 డొమెస్టిక్ సీజన్ తోపాటు కౌంటీ ఛాంపియన్షిప్, వన్డే కప్ లకు అందుబాటులో ఉంటాడని మిడిల్సెక్స్ పేర్కొంది. ఓవర్సీస్ బౌలర్ కోటాలో ఉమేష్ లాంటి బౌలర్ కోసమే తాము ఎదురు చూస్తున్నామని, ఎట్టకేలకు తమకు సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడే దొరికాడు అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version