అప్గానిస్తాన్‌లో క్రికెట్‌ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకుంటే అక్కడ షరియా చట్టం అమలవుతోంది. అయితే, షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని ప్రస్తుతం అక్కడ కొలువుదీరిన తాలిబన్ సుప్రీం కమాండర్ హిబతుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించినట్లు కథనాలు వెలువడ్డాయి.
కాగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అఫ్గనిస్తాన్ బలమైన జట్టుగా ఎదుగుతోంది. పెద్ద పెద్ద జట్లను సైతం అఫ్గాన్ భయపెట్టించే స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో ఆ దేశ సుప్రీం అప్గాన్ క్రికెట్ జట్టుపై నిషేధం విధిస్తే అది ఆ దేశ జట్టుతో పాటు క్రికెట్‌కు శరఘాతంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే, గతంలో ఆశ్రష్ ఘనీ ప్రభుత్వం కూలిపోయాక అధికారాన్ని చేజిక్కుంచుకున్న తాలిబన్ ప్రభుత్వం క్రికెట్‌కు తాము వ్యతిరేకంగా కాదని ప్రకటించిన విషయం తెలిసిందే.దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.